Latest News

పవన్ చెట్లతో మాట్లాడుతూ ఉంటాడట !!!



పవన్ గురించి ఎవరికీ తెలియని ఆసక్తికర అద్భుత విషయాన్ని, పవన్ తో పాటు సేంద్రీయ వ్యవసాయం చేసే ఆయన స్నేహితుడు విజయ్ రాం ఇటీవల తెలియచేశారు.  పవన్ కల్యాణ్…ప్రకృతి ఆరాధకుడని.. ఆయన చెట్లతో కూడా సంభాషిస్తాడని.. వాటి ఆలోచనలను గ్రహించగల శక్తి పవన్ కు ఉందని విజయ్ రాం అంటున్నారు. చెట్లతో మాట్లాడమేంటి విచిత్రంగా ఉంది అనుకుంటున్నారా! ఇదే విషయాన్ని పవన్ సన్నిహిత వర్గాలను సంప్రదించగా, వారు కూడా ఈ విషయాన్ని ఖరారు చేశారు. పవన్ చెట్లతో మాట్లాడతాడని.. తమను కూడా ఒక్కోసారి చెట్లతో మాట్లాడటానికి(ఇక్కడ సంభాషించడం అంటే ఆలోచనలు ఒకరికొకరు ట్రాన్స్ ఫర్ చేసుకోవడం..భావప్రసారం) ప్రయత్నించమని చెబుతుంటాడని వారు చెబుతున్నారు. చెట్లు ఏమంటున్నాయో కూడా ఒక్కోసారి తమకు చెబుతుంటారని వారు ఈ విషయాన్ని నిర్దారించారు. ఇంట్లో  కన్నా పవన్  చెట్ల మధ్యే ఎక్కువగా ఉంటాడని వారంటున్నారు.

CineSollu Designed by Templateism.com Copyright © 2014

Theme images by gaffera. Powered by Blogger.