Latest News

త్రివిక్రం తర్వాత కొరటాలతో చేయనున్న పవన్...!!!



మహేష్‌బాబు కోసం దర్శకుడు కొరటాల శివ ఎప్పుడో స్క్రిప్టుని సిద్ధం చేశాడు. అయితే మహేష్‌ ప్రస్తుతం మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంతో బిజీగా గడుపుతున్నాడు. తీరిక లేకుండా ఆ సినిమా చేస్తున్నా ఎంతకీ పూర్తవ్వడం లేదు. ద్విభాషా చిత్రం కావడమే అందుకు ప్రధాన కారణం. మురుగదాస్‌ చిత్రం ఎప్పుడు పూర్తయితే అప్పుడు తన చిత్రాన్ని పట్టాలెక్కించాలని ఎదురు చూస్తున్నాడు కొరటాల. అయితే ఈ విరామాన్ని ఆయన బాగానే సద్వినియోగం చేసుకొన్నట్టు తెలుస్తోంది. మహేష్‌ సినిమాకి సంబంధించిన స్క్రిప్టుకి మరిన్ని మెరుగులు దిద్దుకోవడంతో పాటు, పవన్‌ కల్యాణ్‌కీ ఓ కథని వినిపించినట్టు పరిశ్రమలో ప్రచారం సాగుతోంది. పవన్‌తో ఓ బలమైన సందేశంతో కూడిన వాణిజ్య చిత్రం చేయాలనేది కొరటాల ప్రణాళిక. అందులో భాగంగానే ఇటీవల ఆయనకి కథ వినిపించారని, శక్తివంతమైన ఆ కథలో నటించేందుకు పవన్‌ కూడా తన అంగీకారాన్ని తెలిపారని ఫిల్మ్‌నగర్‌ జనాలు మాట్లాడుకొంటున్నారు. పవన్‌ ఇటీవల శరవేగంగా సినిమాలు చేస్తున్నారు. ఈ వూపులోనే కొరటాల శివ చిత్రం కూడా చేసేస్తారని, వచ్చే యేడాది ఆ చిత్రం పట్టాలెక్కొచ్చని తెలిసింది. పవన్‌కల్యాణ్‌ ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలో నటిస్తున్నారు.

CineSollu Designed by Templateism.com Copyright © 2014

Theme images by gaffera. Powered by Blogger.