పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ ఫ్యాక్షనిస్టు నుంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా మారనున్నారా?.. అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. పవన్ ప్రస్తుతం డాలీ తెరకెక్కిస్తున్న ‘కాటమరాయుడు’ చిత్రంలో ఫ్యాక్షనిస్టు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్నారు. దీని కోసం రామోజీ ఫిల్మ్‌సిటీలో పెద్ద సెట్ వేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా కనిపించనున్నారని ప్రచారం సాగుతోంది.
పవన్ సరసన కీర్తిసురేష్, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటించనున్నారు. సీనియర్ నటి ఖుష్భూ కీలక పాత్రలో కనిపించనున్నారు. తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. ‘దేవుడు దిగివచ్చినా’ పేరును చిత్రానికి పరిశీలిస్తున్నారు.