రాజమౌళి ఇప్పుడు తెలుగులో నెం. 1 డైరెక్టర్. చాలా నిర్మొహమాటంగా జవాబులు చెప్పగల దర్శక ధీరుడు. చాలా మంది వ్యక్తులు పవన్ కల్యాణ్ - రాజమౌళి కాంబోలో సినిమా ఉంటుంది అంటే నమ్ముతారు వాళ్లందరి నమ్మకాల్ని పటాపంచలు చేస్తూ ఇక్కడ ఉన్న వాటిని చదవండి...
అది 2010... అప్పుడప్పుడే టాలీవుడ్ సెలెబ్రిటీలకు ట్విట్టర్ పరిచయం అవుతున్న రోజులు. ఇప్పుడే xbox కొనుక్కుని video games ఆడుకుంటున్నా అంటూ మహేష్ ట్వీట్లు పెట్టే రోజులవి... ప్రేమ్ రక్షిత్ డాన్సులు చేసి వళ్లు నొప్పులు వచ్చెస్తున్నాయ్ అంటూ తారక్ ట్వీట్లు చేస్తున్న రోజులవి... ఈ హీరోల్లో నెం 1 ఎవరూ అంటూ రాజమౌళి ట్వీట్లు పెట్టిన రోజులవి.
అప్పట్లో పులి సినిమా టైంలో ఎవరో ఒక పవన్ అభిమాని "మీతో పవన్ సినిమా చేయడు ఎందుకంటే మీ సినిమాల్లో అశ్లీలత, బూతులు, వయలెన్స్ ఎక్కువ ఉంటాయ్" అని రాజమౌళికి ట్వీట్ చేసాడు దానికి రిప్లైగా రాజమౌళి "అవును సర్ మీరు చెప్పింది నిజమే అయుండొచ్చు కానీ బంగారం సినిమాలో సుబ్బులు సాంగ్ మీరు విన్నారా అదేమైనా భక్తి గీతమా" అని వెటకరంగా ట్వీట్ చేసాడు దర్శక ధీరుడు.