Latest News

కాటమరాయుడు ఫస్ట్ రివ్యూ & రేటింగ్ ఇదిగో...!!!



‘కాటమరాయుడు ’ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమా తక్కువ ప్రమోషన్ల మధ్య ఒక మోస్తరు అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అజిత్ హీరోగా నటించిన తమిళ హిట్ సినిమా వీరం కు రీమేక్ గా వచ్చిన కాటమరాయుడు హిట్ అయ్యాడో లేదో చూద్దాం... 

కథ : 
 అనంతపురంలోని ఒక గ్రామ పెద్దగా తిరుగులేని విధంగా చెలామణీ అవుతూ ఉంటాడు కాటమరాయుడు. ఇతనికి అమ్మాయిలు అంటే అస్సలు పడదు, ఈ కాటమరాయుడుకి 4 తమ్ముళ్ళు ఉంటారు వారు ఒక్కో అమ్మాయిని ప్రేమిస్తారు. అస్సలు అమ్మాయిలన్నా ప్రేమన్నా ఇష్టంలేని కాటమరాయుడిని వాళ్ళు ఎలా ఒప్పించారు... వీరికి సహాయంగా అలీ ఎలా ఉన్నాడు అన్నదే కథ. 

ప్లస్ పాయింట్స్ : 
పేరుకు వీరం రీమేక్ అన్నారు కానీ సినిమాలో ముఖ్యంగా ఇంటర్వెల్ తర్వాత చాలా కథ మారిపోయింది. ఆ మార్పులే సినిమాను వేరే స్థాయికి తీసుకువెళ్లాయి. అజిత్ చేసిన వీరం సినిమాలో కామెడీ ఉంటుంది కానీ కాటమరాయుడిలో అది వేరే స్థాయికి వెళ్లిపోయింది. అలీ పవన్ కల్యాణ్ మధ్య వచ్చే సన్నివేశాల్లో ప్రేక్షకులు తప్పకుండా కడుపుబ్బ నవ్వుకుంటారు. ఇక్కడ ఆకుల శివ మాటలని మనం ప్రత్యేకంగా గుర్తించాలి. 
ఇది వరకు కృష్ణ, నాయక్ లాంటి హిట్ సినిమాలకు మాటలు రాసిన శివ డైలాగ్స్ సినిమాకి చాలా ప్లస్. పవర్ స్టార్ చెప్పే పంచ్ డైలాగ్స్ అభిమానులని ఉర్రూతలూగిస్తాయ్. టీజర్ ట్రైలర్ లో కొన్ని డైలాగ్స్ మాత్రమే చూపించి సినిమాలో కుప్పల్లో పంచ్ డైలాగ్స్ దాచారు డాలీ. డాలీని కమర్షియల్ డైరెక్టర్ గా నిలబెట్టే సినిమాగా దీనిని తీస్కోవచ్చు. కాటమరాయుడి తర్వాత డాలీ వెనుక బడా హీరోలు క్యూ కడతారు అనడం అతిశయోక్తి కాదు. 

ఈ సినిమాకు మొదట్నుంచీ అనుకున్నట్లే పవన్ కళ్యాణ్‌నే మేజర్ హైలైట్‍గా చెప్పుకోవచ్చు. పవన్ మ్యానరిజమ్స్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీన్స్ అన్నీ ఆయన అభిమానులను అమితంగా ఆకట్టుకుంటాయి. ఒక రకంగా ఈ సినిమాతో వింటేజ్ పవన్ కల్యాణ్ ఈజ్ బ్యాక్ అని చెప్పొచ్చు. 

ఫస్టాఫ్‍లో వచ్చే చిన్న చిన్న కామెడీ బిట్స్, శ్రుతి హాసన్ తో వచ్చే రొమాన్స్ ట్రాక్ అభిమానులకు పండగ వాతావరణం తెచ్చిపెడతాయి. ఇక శ్రుతి హాసన్ కూడా ఈ సినిమాకు మరో హైలైట్‌గా చెప్పుకోవచ్చు. పల్లెటూరి అమ్మాయిగా శ్రుతి చాలా అందంగా నటించడమే కాకుండా పాటల్లో యువతకు నచ్చేలా కూడా చాలా బాగా చేసింది. విలన్‍గా నటించిన రావు రమేష్ అయితే తన డైలాగ్ డెలివెరీతో చాలా బాగా నటించాడు. 
సెకండ్ హాఫ్ లో చిన్న పిల్లతో ఉన్న సన్నివేశాలు చాలా హృద్యంగా చిత్రీకరించాడు డైరెక్టర్ డాలీ. ఇక రామ్ - లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్స్ సినిమాకే హైలైట్. పవన్ కల్యాణ్ పంచె ఎగ్గట్టి కొట్టే ఫైట్ సీన్ అభిమానులనే కాదు సగటు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. 
  
ఇప్పటివరకూ విన్న పవన్ కల్యాణ్ పాటల కంట్తే ఈ సినిమాలో పాటలు ఫ్రెష్ గా ఉండడంతో పాటలన్నీ సినిమాకు మంచి ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. ఇటు మాస్, అటు క్లాస్ రెండు రకాల పాటలూ సినిమాలో మంచి రిలీఫ్ అంశాలుగా చెప్పుకోవచ్చు. మిర మిర మీశం ఫ్యాన్స్ కి పండగ లాంటి పాట. 

మైనస్ పాయింట్స్ : 
నిజానికి రెండున్నర గంటల పాటు చెక్కు చెదరని స్క్రీన్ - ప్లే తో సాగిన కాటమరాయుడిలో మైనస్ పాయింట్స్ చాల తక్కువనే చెప్పాలి. డైరక్టర్ డాలీ తనకున్న అనుభవాన్ని మొత్తం రంగరించి సినిమాలో ప్రతి విభాగం అధ్బుతంగా వచ్చేలా శ్రమించాడు. 

సాంకేతిక విభాగం : 
సాంకేతిక అంశాల విషయానికి వస్తే, అందరికంటే ముందుగా సంగీత దర్శకుడు అనూప్ గురించి చెప్పుకోవాలి. అనూప్ ఈ సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్స్‌లో ఒకరుగా నిలిచారు. ఆయన అందించిన ఆడియో ఇప్పటికే హిట్ కాగా, సినిమాలో విజువల్స్‌తో కలిపి చూసినప్పుడు ఆ పాటలకు మరింత అందం వచ్చింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలోనూ అనూప్ పనితనం బాగుంది. ప్రసాద్ మూరెళ్ళ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కర్నూల్ లోని గ్రామం నేపథ్యాన్ని ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మా కడలి తనదైన సెట్స్‌తో పట్టుకుంటే, ప్రసాద్ ఆ నేపథ్యాన్ని తన కెమెరాలో చక్కగా బంధించారు. గతంలో సర్దార్ కి జరిగినట్టు తప్పులు రిపీట్ కాకుండా ఎడిటింగ్ పని చాలా క్రిస్పీగా చేసారు గౌతమ్ రాజుగారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. 


తీర్పు : 
ఇది ఒక్క పవన్ కల్యాణ్ ఫాన్స్ కి మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకుల్ని సైతం అమితంగా ఆకట్టుకునే సినిమా. ఇది మాస్ కు అలాగే కుటుంబ ప్రేక్షకులకి సైతం సమానంగా నచ్చుతుంది దానికి కారణం సినిమాలో ఉన్న ఎమోషనల్ డ్రామా కూడా. పవన్ కళ్యాణ్ సినిమా అంటే.. సరదాగా నవ్వించే కామెడీ, పవన్ మార్క్ యాక్షన్ సీక్వెన్స్, పవన్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ లాంటివి ప్రధానంగా ఆకట్టుకునే అంశాలతో పాటు తను ప్రేమించిన వారికోసం ఎంతదూరమైన వెళ్ళే కాటమరాయుడి కథ కనిపిస్తూ ఉంటుంది. ఈ సినిమాకు పవన్ చరిష్మానే కాకుండా కామెడీ, కథనం అతిపెద్ద హైలైట్. వినడానికి, చూడడానికి బాగున్న పాటలు, పవన్-శ్రుతి కెమిస్ట్రీ లాంటి మిగతా ప్లస్‍ లు కూడా ఉన్నాయ్. సర్దార్ నష్టాలను ఈ సినిమాతో పూడ్చేయాలని పవన్ కంకణం కట్టుకుని చేసినట్టు ఈ సినిమా కనపడుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. కాటమరాయుడు ఖైదీ 150 రికార్డులకు చెక్ పెడతాడనే చెప్పుకోవచ్చు. 

రేటింగ్ : 3.75 /5 

CineSollu Designed by Templateism.com Copyright © 2014

Theme images by gaffera. Powered by Blogger.