ఆయన నిజ జీవితంలో కూడా హీరో అని అన్నాడు రాజమౌళి.
''ఎక్కడ చూసినా గోన గన్నారెడ్డే. సినిమా దాదాపు ఆగిపోతోంది అనిపించినప్పుడు బన్నీ ప్రవేశం ఒక్కసారిగా దాన్ని పునరుద్ధరించింది. తెలంగాణ ప్రభుత్వం ఈ సినిమాకు వినోదపన్ను మినహాయింపు ఇవ్వడానికి ప్రధాన కారణం బన్నీయేనని తెలిసింది. తెరమీద కూడా అద్భుతంగా చేశాడు. తెరమీద, తెర వెనక కూడా తానే హీరో అనిపించుకున్నాడు. అందుకు గోన గన్నారెడ్డిని గౌరవించి తీరాల్సిందే." అని మెచ్చుకున్నాడు రాజమౌళి
