రుద్రమదేవి దర్శకనిర్మాత నిన్న మీడియా ముందు కంటతడి పెట్టారు. నమ్మిన సినిమా కోసం 80 కోట్లు పెట్టిన గుణశేఖర్. విడుదలను మాత్రం 6 సార్లు వాయిదా వేసుకుంటూ వచ్చారు. తన సర్వస్వాన్ని ఈ సినిమా కోసం పెట్టిన గుణశేఖర్ కు అనుకోని అవాంతరాలు అడుగడుగున అడ్డంపడ్డాయ్ అయినా వాటన్నింటినీ దాటుకుంటూ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ను తెరమీదకెక్కించాడు. ఈ సందర్భంగా కెసిఆర్ ను కలిసిన ఆయన కెసిఆర్ తన సినిమాకు వినోద పన్ను మినహాయింపు ఇచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ గుణశేఖర్ దంపతులిద్దరూ కంటతడి పెట్టారు.
కష్టకాలంలో తమను ఆదుకున్నందుకు సిఎం కు కృతజ్ఞతలు తెలిపారు.
