‘పటాస్’ సూపర్ సక్సస్ తో వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్న సందర్భంలో ఒక మీడియా ప్రతినిధి నందమూరి కుటుంబం నుండి నాలుగవ తరం ప్రతినిధిగా ‘దాన వీర శూర కర్ణ’ తో మాస్టర్ ఎన్టీఆర్ తెరంగేట్రం చేస్తున్నాడు మరి మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు అని ప్రశ్నించిన మీడియా వర్గాలకు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చాడు.
కొన్ని మీడియా వర్గాలలో తాను మోక్షజ్ఞ తొలిసినిమాను తన సొంత బ్యానర్ పై నిర్మిoచ బోతున్నట్లుగా వస్తున్న వార్తలలో నిజంలేదని అయితే అటువంటి అవకాశం వస్తే తనకన్నా ఆనందించే వారు మరొకరు ఉండరు అని చెపుతూ ప్రస్తుతానికి మోక్షజ్ఞ ఎంట్రీ పై తన బాబాయ్ బాలకృష్ణ ఇంకా ఎటువంటి నిర్ణయం పూర్తిగా తీసుకోలేదని అసలు విషయాన్ని బయటకు చెప్పాడు కళ్యాణ్ రామ్.
