‘వారికి మీరు రావడం ఇష్టం లేనప్పుడు.. మీరెందుకు వారి ఫంక్షన్లకు వెళ్లాలని అంత ఆరాటం చెందడం.. ఇకపై వారి ఫంక్షన్లకు వెళ్లకండి.. అలా వెళ్లకపోవడం వల్ల మీకేం నష్టం లేదు’ అని చెప్పారు పవన్ కల్యాణ్ తన అభిమానులకు. పవన్ దగ్గరకు వెళ్ళిన అభిమానులు ‘బ్రూస్ లీ’ ఆడియో రిలీజ్‌కు తమకు పాస్‌లు ఇవ్వకపోవడమే కాకుండా, ఇటీవల కాలంలో మెగా క్యాంప్ తమను అవమానించేలా ప్రవర్తిస్తుందని ఆయనకు తమ గోడు వెళ్లబోసుకున్నట్టు సమాచారం, దానికి పవన్ ఇలా అన్నారు.
అయితే, అభిమానుల ఎదుట అలా చెప్పినట్టికీ ఆ తర్వాత తన సన్నిహితుల దగ్గర ఈ విషయంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారట. ఫ్యాన్స్‌తో దురుసుగా ప్రవర్తించడం కరెక్ట్ కాదని ఆయన వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.
