సహజంగానే హరీష్ శంకర్ మాటలు విన్న ప్రతి ఒక్కరికి తనకు దూకుడు ఎక్కువ అని ఇట్టే తెలిసిపోతుంది. దానికి ప్రతీకగా ఇదిగో ఆయనను కొట్టాడానికి ఓ 100 మంది వచ్చిన ఒక సందర్భం ఉంది.... చదవండీ...
హరీష్ శంకర్ అసిస్టెంట్ డైరెక్టర్ గా మరియు స్క్రిప్ట్ రైటర్ గా వ్యవహరించిన "నిన్నే ఇష్టపడ్డాను" అనే సినిమా షూటింగ్ అరకు లో జరుగుతూ ఉన్నప్పుడు ఒక రైల్వే స్టేషన్ లో ఎవరో ఏదో అన్నారని ఒక వ్యక్తిని హరీష్ శంకర్ లాగి పెట్టి కొట్టాడట ఆ తర్వాత షూటింగ్ కు వెళ్ళిపోయిన వాళ్లు తిరిగి వచ్చేసరికి ఒక 100 మంది హరీష్ శంకర్ ని చూసి వీడే మన వాడిని కొట్టాడు అంటూ కొట్టడానికి వెంటపడ్డారట, అప్పుడు ఎలాగోలా మన గబ్బర్ సింగ్ డైరెక్తర్ బయట పడ్డారనుకోండీ... అదీ మన హరీష్ శంకర్ దూకుడు.
