చిరంజీవి 150 చిత్ర్రం... మెగా ఫ్యాన్స్ ని ఎప్పటినుంచో ఊరిస్తున్న వార్త ఇది. అయితే చిరంజీవి 150వ చిత్రం పూరి డైరక్షన్లో ఉంటుందని ఆ సినిమాని తనే నిర్మిస్తునట్టు రామ్ చరణ్ చెప్పాడు. కాని చిరంజీవి తన పుట్టిన రోజు సంధర్భంగా మీడియాకి ఇచ్చిన ఒక ఇంటర్వీలో పూరి చెప్పిన కధ ఫర్స్ట్ హాఫ్ మాత్రమే బాగుందని, సెకండ్ హాఫ్ తనకి అంత నచ్చలేదని చెప్పారు. అలాగే వేరే కథలని కూడ వింటునట్టు చెప్పారు.
కాని ఇప్పుడు చిరు 150వ సినిమా పూరి నుండి దూరమైనట్టే. చిరంజీవికి ఠాగూర్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన వి వి వినాయక్ చిరు 150వ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. తమిలనాట ఘన విజయం సాధించిన 'కత్తి ' చిత్రాన్ని చిరు తన 150వ సినిమాగా చేయబోతున్నాడు. ఇది దాదాపుగా ఖరారు అయినట్టే. చరణ్ బ్రూస్ లీ సినిమా విడుదల రోజు ఈ విషయాన్ని ప్రకటిస్తారని సమాచారం.