చిరు 150 సినిమా ముందు పూరీతో అని ప్రకటించిన తర్వాత అది కాన్సిల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అత్యంత విశ్వసనీయమైన వర్గాల నుంచి తెలిసిన విషయం ఏంటంటే అది చేసేది వి.వి. వినాయక్. ఆయన తమిళ్ బ్లాక్ బస్టర్ కత్తి సినిమా మొత్తాన్ని కొత్త వర్షన్ లో చిరుకు వినిపించారని, దానిలో కామెడీ మోతాదు చాలా పెంచారని. అది చిరుకు చాలా బాగా నచ్చేయడంతో అదే ఆయన 150 సినిమా ఇది ఫిక్స్.
బ్రూస్ లీ ఆడియో ఫంక్షన్లో కూడా వినాయక్ మాట్లాడుతూ చిరును ఉద్దేశించి "అన్నయ్యా మీరు కత్తిలా ఉన్నారు" అంటూ అనేసరికి చిరు నువ్వు రెండు విధాలుగా అర్థం వచ్చేలా అంటున్నావ్ అని అన్నారు.