అసలు పవన్ కల్యాణ్ అసిస్టెంట్ కి వెళ్ళి మరీ ఒక డిగ్రీ చదివే అమ్మాయితో మాట్లాడాసిన అవసరం ఏంటి?? సినిమాలో అవకాశం కోసమా లేదా ఇంకేదైనా అనే తెలుకోవాలంటే ఇది చదవండి...
పవన్ కళ్యాణ్ మరోసారి తన మంచి హృదయం తో వార్తల్లో నిలిచాడు..కష్టాలలో ఉన్నవారికి పవన్ రూపం లో దేవుడు ఆదుకుంటాడు అని మరోసారి ఈ అమ్మాయి విషయం లో రుజువు అయ్యింది..వివరాల్లోకి వెళ్తే....
డిగ్రీ చదువుకునే అమ్మాయి కొన్నాళ్ళ క్రితమే తండ్రి మరణించాడు. కుటుంబం గడవటమే కష్టంగా ఉన్న ఆ అమ్మాయి తన డిగ్రీ ఫీజు కట్టుకోడానికి 4000 రూపాయలు అవసరమై ట్విట్టర్ ద్వారా స్నేహితులను సహాయం కోరింది. వారు నుండి ఎటువంటి స్పందన రాకపోవడం తో వెంటనే పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ను ట్విట్టర్ ద్వారా సాయం కోరింది.
వెంటనే స్పందించిన రేణు దేశాయ్ తన మేనేజర్ ద్వారా ఆ అమ్మాయి గురించి తెలుసుకొని, నేను సహాయం చేస్తానని, వివరాలు ఇమ్మని కోరింది. వెంటనే ఆ అమ్మాయి వివరాలిచ్చి సాయం కోసం ఎదురు చూసింది. ఆ తర్వాత పవన్ కల్యాణ్ మనిషి ఒకరు ఆ అమ్మాయి చదివే కాలేజీకి వెళ్లి ఫీజు డబ్బు చెల్లించారు. అడిగిన వెంటనే సహాయం అందడంతో ఆ అమ్మాయి రేణు దేశాయ్, పవన్ కల్యాణ్ లకు థ్యాంక్స్ చెప్పింది. రేణు దేశాయ్ కూడా ఆ అమ్మాయిని బాగా చదువుకోమని చెప్పింది. ఈ ఘటనతో పవన్ కళ్యాణ్ మరోసారి తన సహృదయాన్ని చాటుకున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ ను ప్రేమించారు..ఆరదిస్తారు..కొలుస్తారు.