పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమా సెక్యూరిటీ సిబ్బంది మీడియా ప్రతినిధులపై దాడికి దిగారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు రావాల్సిందిగా పవన్ కళ్యాణ్‌కు మంత్రులు అయ్యన్నపాత్రుడు, కామినేని శ్రీనివాస్ ఆహ్వానపత్రిక అందించారు. నానక్‌రాంగూడలోని రామానాయుడు స్టూడియోలో పవన్‌ను వాళ్లు కలిశారు. ఈ సందర్భంగా అక్కడికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై చిత్ర యూనిట్ సెక్యూరిటీ సిబ్బంది దాడికి దిగారు. ఈ దాడిలో పలువురు కెమెరామెన్లకు గాయాలయ్యాయి. పవన్ బౌన్సర్ల దాడిని ఖండిస్తూ వీడియో జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. బౌన్సర్లు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పవన్.. కెమెరామెన్‌పై దాడి ఘటన దురదృష్టకరంగా అభివర్ణించారు. ఈ ఘటనలో ఏదైనా తప్పుంటే క్షమించాలని కోరడంతో గొడవ సద్దుమణిగింది.
See more at: http://www.tv5news.in/newsdetails.aspx?ID=28560&SID=6&Title=TV5%20NEWS:%20pavan%20kalyan%20says%20sorry%20to%20media#sthash.dKAfGgLG.dpuf