మహేష్ బాబు బావ సుధీర్ బాబుకు షూటింగ్ లో ఉండగా యాక్సిడెంట్ జరిగింది. తన నెక్స్ట్ ఫిల్మ్ షూటింగ్ లో యాక్షన్ సీన్స్ లో డూప్ చేయాల్సిన సీన్లను కూడా తనే చేసే మధ్యలో తను గాయపడినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
విలన్ తో ఉన్న ఫైట్ లో కార్ మీద నుంచి విలన్ పైకి జంప్ చేసే సీన్లో రోప్ మిస్ అవ్వడంతో 6 అడుగుల ఎత్తు నుంచి పడిపోవడంతో గాయాలపాలయ్యాడట. పెద్ద దెబ్బలేవి తగలకపోవడంతో యూనిట్ సభ్యులు ఊపిరి పీల్చుకున్నరట. మళ్ళి కాసేపు తర్వాత యథావిధిగా షూటింగ్ జరిగిందంట.
