Latest News

పవన్ సూచనలతో బ్రూస్ లీ


పవన్ కు మార్షల్ ఆర్ట్స్ కొట్టిన పిండి. కుంగ్ ఫూ – కరాటే విద్యల్లో కూడా మంచి నైపుణ్యం ఉంది. కెరీర్ ఆరంభంలో మార్షల్  శిక్షణలో ఆరితేరాడు. ఆ ఫ్యాషన్ తోనే జానీ సినిమాను తనే స్వయంగా తెరకెక్కించాడు. ఎప్పటికప్పుడు వీటిపై మార్కెట్ లోకి వచ్చే సీడిలను పవన్ చాలా శ్రద్ధగా సేకరిస్తుంటాడు. ఇప్పుడు వాటిని చరణ్ సినిమాకు రిఫరెన్స్ లుగా వాడుకోమని ఇంటికి పంపిచాడట. ఫైట్ మాస్టర్ కూడా ఆ సీడిలన్నింటి ని చూసి ఫైట్స్ కంపోజ్ చేస్తున్నాడని యూనిట్ వర్గాలు అంటున్నాయి.
చరణ్ బ్రూస్ లీ సినిమాకి పవన్ కల్యాణ్  వాయిస్ ఓవర్ ఇవ్వడం లేదు గానీ తన వద్ద ఉన్న డివీడీల్ని మాత్రం  రిఫరెన్స్ గా పంపిస్తున్నాడట. వాటిలో పోరాట సన్నివేశాల్ని చెక్ చేయాల్సిందిగా పవన్ సజెస్ట్ చేస్తున్నాడట. డీప్ గా డీటెయిల్స్ లోకి వెళితే..  చరణ్ నటిస్తోన్న బ్రూస్ లీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది. ఇందులో చెర్రీ  ఫైట్ మాస్టర్ గా కనిపించనున్నాడు. అందుకే బాబాయ్ సూచనలను.. .సలహాలను తీసుకుంటున్నాడట
బాబాయి అభిమానంతో ఇచ్చిన ఈ డివీడిలు బాగా ఉపయోగపడుతున్నాయని  అంటున్నాడట

CineSollu Designed by Templateism.com Copyright © 2014

Theme images by gaffera. Powered by Blogger.