జై సినిమా అపుడు ఆ సినిమాని నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఎడిటింగ్ రూమ్ లో తన ప్రమేయం లేకుండా ఎడిటింగ్ చేసినందుకుగాను ఈ సినిమా నాది కాదు అంటూ తేజ ప్రెస్ మీట్ పెట్టి అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం అందరికి తెలిసిందే.
దాని గురించి చెప్పమని అడుగగా తేజ నేను పరిచయం చేయకముందు అందరు తేజ గారు అంటూ వెంట తిరిగేవారు సక్సెస్ అయ్యాక మాత్రం పట్టించుకోరు. నేను పరిచయం చేసిన హీరోలందరు నా దృష్టిలో, చనిపోయినట్లే ఉదయ్ కిరణ్ ముందే చనిపోయారు మిగిలిన బ్రతికున్న వారిలో నవదీప్ తప్ప అందరు చనిపోయినట్లే. ఇలా నితిన్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేసారు తేజ.
