మ్యాటర్ ఏంటంటే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో ఈటీవీ సౌందర్యలహరి పేరుతో ఓ షో నిర్వహిస్తోంది. ఈ ప్రోగ్రామ్‌లో ఆయన దర్శకత్వంలో నటించిన నటీనటులు, ఆయనతో కలిసి పనిచేసిన సాంకేతిక నిపుణులతో దర్శకేంద్రుడు పాల్గొని నాటి అనుభవాలను పంచుకుంటున్నారు.
వివిధ భాషల్లో రాఘవేంద్రుడితో కలిసి పని చేసిన వారందరూ కూడా వచ్చి తమ అనుభవాలు పంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, జయప్రద, జయసుధ నుంచి అమెరికాలో ఉన్న దీప్తీ భట్నాగర్ నుంచి ఖుష్బూ, సుమలత, టాబు, రవళి, సంఘవి ఇలా ఇప్పుడు ముంబై, బెంగళూరు, చెన్నైతోపాటు విదేశాల్లో ఉంటున్న వారు కూడా స్వరాభిషేకంలో పాల్గొని నాటి అనుభవాలను నెమరవేసుకుని రాఘవేంద్రుడిపై తమ అభిమానం చాటుకున్నారు.
అయితే వీరందరు రాఘవేంద్రుడు అడిగిన వెంటనే ఓకే చెపితే తాను పరిచయం చేసిన ముగ్గురు హీరోలు మాత్రం దర్శకేంద్రుడిని నానా ఇబ్బందులకు గురి చేశారట. ప్రిన్స్ మహేష్,బన్నీ, వెంకటేష్‌ను రాఘవేంద్రుడే పరిచయం చేశాడు. దర్శకేంద్రుడే వారికి తొలి క్లాప్ కొట్టాడు. అయితే, ఈ ముగ్గురినీ ఈ కార్యక్రమానికి పిలవగా ముగ్గురు సరిగా స్పందించలేదట. వాయిదాల మీద వాయిదాలు వేసి విసుగు తెప్పించారట.
వెంకటేష్, బన్ని ఖాళీ ఉన్నప్పుడు వచ్చి ఈ కార్యక్రమాన్ని మమ అనిపించి వెళ్లిపోయారట. మహేష్ మాత్రం ఇప్పుడు, అప్పుడు అంటూ రాఘవేంద్రుడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా చివరకు రాకుండా ఆయనకు చికాకు తెప్పించాడట. దీంతో ఈ ముగ్గురి వైఖరితో విసిగిపోయిన రాఘవేంద్రరావు తన సన్నిహితుల వద్ద వీరు తనను అవమానించారని వాపోయాడట. స్టార్లు అయిన చిరంజీవి, శ్రీదేవి లాంటి వారు తాను పిలవగానే ఎంతో గౌరవంతో ఈ కార్యక్రమానికి వస్తే వీరు ముగ్గురు మాత్రం చాలా ఇబ్బంది పెట్టినట్టు దర్శకేంద్రుడు ఫీలయ్యాడని సమాచారం.
