పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీలు అంటే, ఆ మూవీలలో వినసొంపైన సాహిత్యం ఉంటుంది. తన మొదటి మూవీ నుండి వరుసగా వచ్చిన పది మూవీల వరకూ అదే క్యాలిటీస్ ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చాడు. అయితే కొన్ని సందర్భాల్లో కమర్షియల్ హంగులు డిమాండ్ చేసి, పవన్ స్తైతం ఏమి చేయలేనంతగా తన పాటల్లో బూతులు పెట్టుకోవటం అనేది సహజంగా జరిగిపోయేదంట.
ఇటువంటి సందర్భాల్లో తప్పితే, మిగతా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ కి ఐటెం సాంగ్ లన్నా, ఐటెం సాంగ్ లో స్త్రీలపై ఉపయోగించే డబుల్ మీనింగ్ డైలాగ్ లన్నా అసహ్యం, కోపం. ఇదిలా ఉంటే తాజాగా సర్ధార్ గబ్బర్ సింగ్ మూవీకి సంబంధించిన ఓ ఐటెం సాంగ్ కోసం ఓ కొత్త రచయితకి అవకాశం ఇచ్చారంట. అయితే ఆ రచయిత తన సాంగ్ ని వినిపిద్దామని పవన్ వద్దకి వస్తే, సాంగ్ మొత్తం విన్న పవన్ కి కంపరం మొదలైందట.
“ఇందులో సాంగ్ ఎక్కడ ఉంది సార్, అన్నీ బూతులే ఉన్నాయి కదా. బూతుల తగ్గించి, జానాపదంలోని మాస్ ని బయటకు తీయి. వాటితో ఓ పాటని రాయి” అని సీరియస్ గా చెప్పి పంపించినట్టు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. దీంతో రచయిత సైతం పవన్ కోపానికి భయపడిపోయి, మళ్ళీ పవన్ చెప్పిన మార్పులతో వచ్చి పాటని వినిపించాడంట.
అయితే ఆ పాట అంతగా నచ్చకపోవటంతో దానిని పక్కన పడేశారనే సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న సర్ధార్ గబ్బర్ సింగ్ మూవీ షూటింగ్ ని శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన థియోట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ ప్లానింగ్స్ చేసుకుంటుంది. ఈ మూవీపై పవన్ కళ్యాణ్ సైతం హై ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నాడంట.
