Latest News

రామయ్య వస్తావయ్యా అక్కడ బ్లాక్ బస్టర్



తెలుగులో హరీష్ శంకర్ దర్శకత్వంలో జూ ఎన్టీఆర్ నటించిన ‘రామయ్యా వస్తావయ్యా' చిత్రం ఇక్కడ భారీ పరాజయం చవిచూసింది. ఈ సినిమా వల్ల నిర్మాత దిల్ రాజుకు నష్టాలే మిగిలాయి. దీంతో శాటిలైట్ హిందీ డబ్బింగ్ రైట్స్ చాలా తక్కువ ధరకే నార్త్ ఇండియన్ బిజినెస్‌మేన్‌కు అమ్మారు దిల్ రాజు. ఈ సినిమాను హిందీలో ‘మార్ మిటేంగే 2' పేరుతో గోల్డ్‌మైన్స్ టెలిఫిల్మ్స్ బేనర్లో టీవీల్లో విడుదల చేసారు. 

గత వారాంతం ఈ సినిమా సోనీ సెట్ మాక్స్‌లో విడుదలై అత్యధిక టీఆర్‌‍పి రేటింగును సొంతం చేసుకుంది. ఇతర టీవీ కార్యక్రమాలు, సినిమాల టీఆర్‌పి రేటింగులను అధిగమించింది. గత వారాంతం నమోదైన టాప్ 5 టీఆర్పీ రేటింగ్స్ లిస్టులో ‘మార్ మిటేంగే 2' స్థానం దక్కించుకుంది.

Read more at: http://telugu.filmibeat.com/news/jr-ntr-mar-mitenge-2-trp-rating-048084.html

CineSollu Designed by Templateism.com Copyright © 2014

Theme images by gaffera. Powered by Blogger.