మిర్చి, శ్రీమంతుడు లాంటి బాక్ టు బాక్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన కొరటాల శివ... ఆయన ఫేవరెట్ హీరో తారక్ టెంపర్, నాన్నకు ప్రేమతో లాంటి హిట్ సినిమాల తర్వాత జత కడుతున్నారు అని అనౌన్స్ చేయగానే చాలా మందికి వణుకు మొదలయింది. అలాంటి వణుకు టీజర్ రిలీజ్ తర్వాత పెరిగిపోయింది. తర్వాత జరిగిన ఆడియో లాంచ్ లో వదిలిన పాటలు, థియేట్రికల్ ట్రైలరు చూసి ఒక మోస్తరుగా ఉన్నాయని, కొరటాల శివ దేవి శ్రీ ప్రసాద్ వాళ్ళ స్థాయికి తగ్గట్టు లేవని నార్మల్ ఆడియన్స్ పెదవి విరిచేసారు. అయినప్పటికి కొరటాల శివ మీద నమ్మకంతో మోహన్ లాల్, సమంత, నిత్యా మీనన్ లాంటి వాళ్ళు ఉండడంతో సినిమాకు హైప్ బాగా పెరిగిపోయింది. విపరీతంగా బెనిఫిట్ షోలు, ప్రీమియర్స్ తో బాహుబలి రికార్డ్స్ కు పోటీ ఇస్తూ సాగుతున్నయి.
ఇలాంటి తరుణంలో జనతా గారేజ్ ప్రీమియర్స్ జరిగాయి, నందమూరి ఫాన్స్ ఏదైతే వినకూడదు అనుకున్నారో అదే జరిగింది. ఒక ఊపు మీద పూనకాలతో వెళ్లిన అభిమానులు చప్పబడిపోయి తిరిగొస్తున్నట్లు సమాచారం. 2nd Half బాగా స్లోగా ఉందని, 1st Half కూడా OK గా ఉందన్న టాక్ వస్తోంది. కంటెంట్ మీద బాగా నమ్మకం ఉంది అన్న కొరటాల శివ మాజిక్ గత రెండు సినిమాలా Work Out అవ్వలేదని, చాలా ఆశలతో ఉన్న NRI NTR Fans అందరు నిరాశ పడుతున్నట్లు సమాచారం. పోనీలేంది ఈ 2016 మన పెద్ద హీరోలందరికి మంచిది కాదేమోలే. Lets wait for 2017.