Latest News

రాబోతున్న పవర్ స్టార్ న్యూస్ ఛానెల్... చదవండి



ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ త్వ‌ర‌లోనే సినిమాల‌కు గుడ్ బై చెప్పేసి... 2019 ఎన్నిక‌ల్లో  ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో రాబోతున్న‌ట్టు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.అయితే..  ఆంధ్ర‌ప్ర‌దేశ్ - తెలంగాణ రాష్ట్రాల్లో జ‌న‌సేన పార్టీ సిద్దాంతాల‌ను ఆలోచ‌న‌ల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు సొంతంగా ఓ మీడియా సంస్థ ఉంటే బాగుంటుంద‌ని ప‌వ‌న్ ఆలోచిస్తున్నార‌ట‌. న్యూస్ ఛాన‌ల్ తో పాటు న్యూస్ పేప‌ర్ కూడా ఉండాలి అనుకుంటున్నార‌ట‌. నిజంగా ప‌వ‌న్ ఛాన‌ల్ పెట్టాల‌ని అనుకుంటున్నారో లేదో కానీ...ప‌వ‌న్ ఛాన‌ల్ పెడుతున్నార‌నే వార్త  ప్ర‌స్తుతం సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ సైట్స్ లో బాగా వినిపిస్తుంది.

సొంతంగా ఛాన‌ల్ పెట్టాలంటే చాలా ఖ‌ర్చు అవుతుంది. అందుచేత ఆల్రెడీ ఉన్న ఓ ఛానల్ ను కొంటే బాగుంటుంద‌ని మ‌రో ఆలోచ‌న కూడా ఉంద‌ట‌. అయితే ముందుగా ఓ యుట్యూబ్ ఛాన‌ల్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. త‌న స్టాఫ్ కి జీతాలు ఇవ్వ‌డానికే డ‌బ్బులు లేవ‌ని,  నెల గ‌డ‌వ‌డ‌మే చాలా క‌ష్టంగా ఉంద‌ని మీడియాకి చెప్పిన ప‌వ‌న్ ఒక ఛాన‌ల్ పెట్ట‌డం..లేదా కొన‌డం, న్యూస్ పేప‌ర్ పెట్ట‌డం అంటే సాధ్య‌మ‌య్యే ప‌నేనా అనిపిస్తుంది. అయితే...ప‌వ‌న్ అనుకోవాలే కానీ..ఆయ‌న‌కి సాధ్యం కానిది ఏముంటుంది. మ‌రి...ప్ర‌చారంలో ఉన్న‌ట్టు ప‌వ‌న్ ఛాన‌ల్ పెడ‌తారో లేదో క్లారిటీ రావాలంటే మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే.

CineSollu Designed by Templateism.com Copyright © 2014

Theme images by gaffera. Powered by Blogger.