Latest News

హ్యాకర్ గా నటించనున్న పవన్ కల్యాణ్... చిత్ర వివరాలు చదవండి


సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత SJ సూర్య దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో హ్యాకర్ గా నటించబోతున్నడట పవర్ స్టార్ పవన్ కల్యాణ్ . సాధారణంగానే కొత్త రకం సినిమాలు కోరుకునే పవన్ కల్యాణ్ ఇలా హ్యాకర్ నటించబోతున్నాడనే విషయం సినీ వర్గాల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. బాహుబలి తర్వాత కొత్త కథల్ని బాగా చూస్తున్న తెలుగు ఆడియన్స్ ని విస్మయపరిచేలా ఈ కథ ఉండబోతోందని... "వికీ లీక్స్" అధినేత "జూలియన్ అసాంజే" ని పోలి ఉండబోతోందంట. ఈ లీక్స్ తర్వాత ప్రభుత్వాల్లో వచ్చిన అల్లకల్లోలాన్ని మరియు అసాంజే ఎదుర్కొన్న విపరీత పరిస్థితుల్ని కూడా చూపించబోతున్నరని వినికిడి. SJ సూర్య అద్భుతంగా తయారు చేసుకున్న ఈ కథని ఒకేసారి తమిళ, హింది, తెలుగులో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రం షూటింగ్ మే చివరి వారం మొదలు పెట్టబోతున్నారని 2017 ప్రథమార్థంలో రిలీజ్ కు ప్రయత్నిస్తున్నారని వినికిడి. 

CineSollu Designed by Templateism.com Copyright © 2014

Theme images by gaffera. Powered by Blogger.