సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ రోజు తెల్లారి 8 కే నెగటివ్ రెవ్యూలు మొదలయ్యాయి. ఒక వెబ్ సైట్ మీద ఇంకొకటి ఇలా నెగటివ్ రివ్యూలు రాయడం జరిదింది కానీ సినిమా చూసిన మామూలు జనాలు మాత్రం సినిమా రివ్యూలలో ఇచ్చినంత దరిద్రంగా అయితే లేదని, సినిమా బాగానే ఉందని చెప్పడం గమనార్హం.
మామూలుగా పెద్ద హీరోల సినిమాలు ఎంత చెత్తగా ఉన్నా కనీసం 3/5 రేటింగ్ ఇచ్చే వెబ్ సైట్లు ఇలా 1.5, 2.5 రేటింగ్ ఇవ్వడానికి ప్రధాన కారణం మీరే చదవండి...
శ్రీమంతుడు సినిమాతో తెలుగు సినిమాలో ఒక కొత్త ట్రెండ్ ఒకటి మొదలయింది అది సినిమా రిలీజ్ కు 2,3 రోజుల ముందు మీడియా వారందరిని అంటే ప్రింట్ మీడియా + కేబుల్ మీడియా + సోషల్ మీడియా (వెబ్ సైట్ ఓనర్స్) ని పిలిచి ఒక పెద్ద హోటల్ లో పార్టీ పేరుతో సినిమా రివ్యూల గురించి ఒక ఒప్పందానికి రావడం. దీని ద్వారా మంచి రేటింగ్ ఇచ్చిన ప్రతి వెబ్ సైట్ లాభపడేలా చేయడం. ఇది సినిమా వారు మరియు మీడియా వారు ఇద్దరు లాభపడేలా చేస్తుంది.
ఇదే ట్రెండ్ ని తర్వాత రిలీజ్ అయిన నాన్నకు ప్రేమతో యూనిట్ కూడా ఫాలో అయిపోయింది. కానీ సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ కు ముందు ఆ సినిమా యూనిట్ వారు తెలుగు మీడియా వారికి ఒక్క పార్టీ కూడా ఇవ్వకపోవడం సరికదా రివ్యూల ఒప్పందానికి కలవడానికి ప్రయత్నించిన వెబ్ సైట్ వారిని తిప్పి పంపించారట. దీంతో ఆగ్రహం చెందిన మీడియా వారు తక్కువ రివ్యూలు ఇచ్చారని ఒక వెబ్ సైట్ వారే చెప్పడం గమనార్హం.
అంతే కాకుండా ఇప్పుడిప్పుడే మొదలవుతున్న ఈ మీడియా పార్టీల సంస్కృతి సర్దార్ హిట్ అయితే పోతుందని అది వారి ఆదాయ మార్గాన్ని ఆపేస్తుందని భావించిన మీడియా వారు సర్దార్ సినిమాని తక్కువ రివ్యూలతో తొక్కేయడం బాధాకరం. ఇక నుంచి చచ్చినట్టు ప్రతి సినిమా వారు వెబ్ సైట్ వారికి డబ్బు ముట్టచెప్తే కాని మంచి రివ్యూలు రాని పరిస్తితి సంభవించడం ఖాయం.