మెగాస్టార్ చిరంజీవి పెద్ద కొడుకును తానేనంటూ ఒక వ్యక్తి ఈ రోజు హెచ్‌ఆర్సీని ఆశ్రయించాడు.. అతని పేరుసుజిత్ అలియాస్ రవీందర్ అని తెలుస్తుంది.టాలీవుడ్ ని షాక్ కి గురిచేసిన సుజిత్ తాను చిరంజీవి నటించిన పసివాడి ప్రాణం సినిమాలో నటించానంటూ చెబుతున్నాడు.
అయితే…ఇదంతా పెద్ద బోగస్ అంటూ మెగాస్టార్ అభిమానులు కొట్టి పడేసారు. అసలు పసివాడి ప్రాణం సినిమా లో చిరు కొడుకుగా నటించింది అమ్మాయని వారు తెలిపారు. ఎప్పుడో 28 ఏళ్ల ముందర పసివాడి ప్రాణం సినిమా రాగా.. ఇప్పుడు కొడుకునంటూ చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉందని మెగా అభిమానులు మండిపడుతున్నారు. పబ్లిసిటీ కోసమే సుజిత్ ఈ డ్రామాలు ఆడుతున్నాడని చిరు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.