మహేష్ కి గుణకి మంచి రిలేషన్ ఉంది. గుణశేఖర్ డైరెక్షన్ లో షార్ట్ పీరియడ్ లో మూడు సినిమాలు చేశాడు టాలీవుడ్ సూపర్ స్టార్ . ఒక్కడు బ్లాక్ బస్టర్ కాగా.. అర్జున్ మూవీ పర్వాలేదు అనిపించు కొంది .. సైనికుడు ఘోరంగా ఫెయిలయ్యాయి. మామూలుగా ఫ్రెండ్లీ నేచర్ ఉండే మహేష్ కూడా.. ఆ కోపంతోనే గోన గన్నారెడ్డి పాత్ర చేయనని చెప్పాడంటూ బాగానే వార్తలొచ్చాయి అప్పట్లో.
మహేష్ తో తనకు అలాంటి అనుభవం ఏం లేదని తేల్చేశాడు గుణశేఖర్. అనవసరంగా మహేష్ ను ఆడిపోసుకోనవసరంలేదు.. అసలు గోన గొన్నారెడ్డి రోల్ కోసం అతడిని ఎప్రోచ్ కూడా కాలేదని చెప్పాడు గురుడు.
