ఆగడు సినిమా అప్పుడు మహేష్ శ్రీను వైట్ల గారిని పంపించి గోవిందుడు సినిమా రిలీజ్ డేట్ కొంచెం తర్వాత పెట్టుకోమని అంటే పెట్టుకున్నాం. అలాగే బాహుబలి అప్పుడు రాజమౌళి గారు మహేష్ శ్రీమంతుడిని రిలీజ్ డేట్ మార్చుకోమంటే ఇగోలు లేకుండా మార్చుకున్నారు. అలాగే మహేష్ అడిగితే కిక్ -2 మార్చుకున్నారు. ఇలా మాలో మాకు ఒక మంచి ఒప్పందం ఉంది.
కానీ బ్రూస్ లీ అక్టోబర్ లో రిలీజ్ చేస్తామని మేము ఫిబ్రవరిలోనే చెప్పాము. కానీ రుద్రమదేవి, అఖిల్ సినిమా నిర్మాతలు ఎవరూ మమ్మల్ని వచ్చి ఏమీ అడగలేదు. మేము మాత్రం ఎప్పటిలాగే సినిమాను రిలీజ్ చేసేస్తున్నాం అని చెప్పాడు రామ్ చరణ్ . నిన్న జరిగిన ఇంటర్వ్యూలో బ్రూస్ లీ సినిమా ఇలా రుద్రమదేవికి, అఖిల్ మూవీకి వారం లోపే రిలీజ్ అవ్వడం వల్ల నష్టం కదా అన్న ప్రశ్నకు చెర్రి ఇలా చెప్పాడు. రుద్రమ దేవి నిర్మాత గుణ శేఖర్, అఖిల్ నిర్మాత నితిన్ అన్న విషయం మనకు తెలిసిందే.