ఖుషి.. తమిళంలో సూపర్ హిట్. తెలుగులో బ్లాక్ బస్టర్. డైరెక్టర్ ఎస్.జె.సూర్యకు ఈ సినిమా దేశవ్యాప్తంగా పేరు తెచ్చిపెట్టింది. ఐతే ఆ సినిమాతో వచ్చిన పేరును నిలబెట్టుకోలేకపోయాడు సూర్య. అప్పట్నుంచి అతడి కెరీర్లో చెప్పుకోదగ్గ విజయాల్లేవు.ఐతే తనకు ఎనలేని కీర్తి తెచ్చిపెట్టిన సినిమాకు సీక్వెల్ తీసి మళ్లీ తనేంటో నిరూపించుకోవాలనుకుంటున్నాడు సూర్య. ఖుషి సినిమా సీక్వెల్‌కు అతను రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
సీక్వెల్‌లోనూ విజయే హీరోగా నటిస్తాడట. అతడి సరసన నయనతారను హీరోయిన్‌గా అనుకుంటున్నారు. ఐతే సూర్య ఈ సినిమాను తెలుగులోనూ తీస్తాడా.. తీస్తే పవనే హీరోనా.. అన్నది ఆసక్తికరం. ప్రస్తుతం పవన్ చేయాల్సిన సినిమాలు చాలానే పెండింగులో ఉన్నాయి. మరి 'ఖుషి-2' సంగతి ఏమవుతుందో చూడాలి.
