సమీర్ బాలయ్య తో లెజెండ్ సినిమాలో నటించిన విషయం అందరికి తెలిసిందే. దీని గురించి సమీర్ ఈనాడుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇలా చెప్పారు "ఒక రోజు బాలయ్య నా భార్య ఫోన్ నంబర్ అడిగారు, వారి భార్య ఏదో వ్రతం చేస్తోందట దానికి నా భార్యను కూడా పిలవాలి అని ఫోన్ చేసారు. ఫోన్లో మాట్లాడుతూ అమ్మా సమీర్ ఇంట్లో ఉన్నాడా అని అడిగారు బాలయ్య. దానికి మా ఆవిడ లేదండీ మీ షూటింగ్ కే అని బయల్దేరారు అని చెప్తే, లేదమ్మా మీ ఆయన రాలేదు ఆయన వల్ల షూటింగ్ ఆగిపోయింది" అని చెప్పారట
తర్వాత విషయం తెలిసిన సమీర్ ఎందుకండీ నన్నిలా బుక్ చేసారు అంటే ఈవాళ సండే కదా కాస్త మసాలా ఉండాలి కదా అంటూ నవ్వేశారట బాలయ్య.