Latest News

మహేష్ సినిమా ఫ్లాపైతే ఇలా చేస్తాడా


శ్రీమంతుడు సక్సెస్ తో మహేష్ చాలా ఆనందంగా ఉన్నాడు. ఈరోజు ఈటీవి కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ మాట్లాడుతూ తన సినిమా ఫ్లాప్ అయితే మహేష్ ఏమ్ చేస్తాడు అనే విషయం చెప్పారు సినిమా ఫ్లాప్ అయితే ఆ ప్రభావం తన మీద ఒక రెండు మూడు నెలల వరకు ఉంటుందని, ఒక రెండు వారాల పాటు కనీసం ఇంట్లో వాళ్లతో కూడా మాట్లాడనని చెప్పారు. సినిమా సక్సెస్ అయితే అది తన ఒక్కడిదే కాదని చిత్ర యూనిట్ మొత్తానిది అని కానీ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం అది తన ఒక్కడి తప్పే అని చెప్పారు. ఎందుకంటే తను ఆ సినిమా కథని ఒప్పుకోకపోయుంటే ఆ కథ సినిమా రూపం దాల్చి ఉండేది కాదు కదా అని చెప్పారు. ఈ మాటలతో మహేష్ మళ్లీ అందరి మనసులు దోచుకున్నాడు. 

CineSollu Designed by Templateism.com Copyright © 2014

Theme images by gaffera. Powered by Blogger.