మూవీ రివ్యూ అనగానే కథ కథనం పాత్రలు సంభాషణలు లాంటి ఎదవ సొల్లు చెప్పకుండా డైరెక్ట్ పాయింట్ కి వచ్చేద్దాం. సుప్రీమ్ ఇది ఓ కామెడీ ఎంటర్టైనర్. 1st half లో వచ్చే వెన్నెల కిషోర్, రాశి ఖన్నా, ప్రభాస్ శ్రీను, 30 Years Industry పృథ్వి కామెడీ మిమ్మల్ని సీట్లలో కూర్చోనివ్వదు. సినిమా ముందు సాయి ధరమ్ తేజ్ అంటే పెద్దగా Opinion లేని వాళ్ళకు కూడా ఈ సినిమా చూడగానే చాలా బాగా చేశాడే అనిపించక మానదు. అనిల్ రావిపూడి డైరెక్టర్ గా ఇతని కామెడీ టైమింగ్ చాలా బాగుంది. ఇంక ఈ సినిమాలో చేసిన ఓ బుడ్డోడు (పేరు తెలీదు కానీ) బాగా చేసాడు క్యూట్ గా ఉన్నాడు. 2nd Half కొంచెం కథపై ఎక్కువ సీన్లు ఉన్నా ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ తో సినిమాని బాగా లాగించేసాడు దర్శకుడు. సినిమాలో కామెడీ మాత్రం ఓ రేంజ్ లో Work Out అయింది. కామెడీ లవర్స్ తప్పక చూడాల్సిని సినిమా ఇది. గుర్తుపెట్టుకోండి.. పేరు సాయి ధరమ్ తేజ్... ఇతనికి మాత్రం చాలా Future ఉంది Big star అయ్యే లక్షణాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా తన ఎంట్రన్స్ సీన్ లో ఉన్న Fight లో ఇచ్చే Expressions Mega family లో ఈ తరం Actors లో ఇతను మాత్రమే ఇవ్వగలిగేలా ఉన్నాయి. Dance ని చాలా అలవోకగా సునాయాసంగా చేసేసాడు. వరసగా పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమన్యం ఫర్ సేల్, సుప్రీమ్ తో 3 హిట్లు కొట్టేసాడు ఈ "సుప్రీమ్ హీరో".
రేటింగ్ : 3.5/ 5