Latest News

ఇండస్ట్రీని గందరగోళానికి గురిచేస్తున్న మహేష్ ... !!!



సూపర్ స్టార్ మహేష్ బాబు ఏదైనా పక్కా ప్లానింగ్‌తో చేస్తాడని అంటారు. షూటింగ్ షెడ్యూళ్ల దగ్గర్నుంచి.. ఆడియో విడుదల.. సినిమా రిలీజ్ అన్నీ కూడా పక్కాగా ప్లాన్ చేసుకున్నాకే రంగంలోకి దిగడం మహేష్‌కు అలవాటు. ఐతే అతడి కొత్త సినిమా ‘బ్రహ్మోత్సవం’ విషయంలో మాత్రం మొదట్నుంచి ఏదో ఒక గందరగోళం నడుస్తోంది. ఈ సినిమా షూటింగ్ అనుకున్న ప్రకారం జరగలేదు. మధ్య మధ్యలో బ్రేకులొచ్చాయి. కొన్ని రోజులు షూటింగ్ ఆపి.. స్క్రిప్టును మార్చుకోవాల్సి వచ్చినట్లు కూడా వార్తలొచ్చాయి. ఇక ఆడియో.. సినిమా రిలీజ్‌కు సంబంధించి గత రెండు నెలల్లో చాలా డేట్లు వినిపించాయి. ఏప్రిల్ 29 మొదలుకొని.. మే 27 వరకు ఐదు రకాల డేట్లు వినిపించాయి. ఆడియో గురించి కూడా ఇలాగే గందరగోళం నెలకొంది.

ఇప్పుడు కొత్తగా ఆడియో.. రిలీజ్.. విషయంలో కొత్త సంగతులు వినిపిస్తున్నాయి. ఏప్రిల్ 24న తిరుపతిలో చేయాలనుకున్న ఆడియో వేడుకను మే 1కి మార్చిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం మే 7న హైదరాబాద్‌లోనే ఆడియో రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. సినిమాను కూడా గతంలో ఓసారి అనుకున్నట్లుగా మే 27కు మార్చేశారట. మే 13న రిలీజ్ చేయాలంటే హడావుడి అవుతుందని భావించి నెలాఖరుకు వెళ్లిపోయారట. ఆ తేదీకి రజినీ సినిమా ‘కబాలి’ వస్తుందని అనుకున్నప్పటికీ ఆ సినిమా జూన్ 3కు వాయిదా పడటంతో మహేష్ కోసం ఆ తేదీని ఫిక్స్ చేసుకున్నారు. ఐతే కనీసం ఈ తేదీలయినా కన్ఫమ్ అయితే ఓకే. మళ్లీ డేట్లు మార్చి 
ఇండస్ట్రీని గందరగోళానికి గురి చేయకుంటే బెటర్. ఎందుకంటే బ్రహ్మోత్సవం అనే ఓ భారీ సినిమా రిలీజ్ పై ఆధారపడి చాలా చిన్న సినిమాల రిలీజ్ లు ఉంటాయి. చిన్న సినిమాల గురించి కూడా కొంచెం మహేష్ ఆలోచిస్తే ఇండస్ట్రీకి మంచిది. 


CineSollu Designed by Templateism.com Copyright © 2014

Theme images by gaffera. Powered by Blogger.