ఇందుకు కాదా ఆయనంటే జనాలు పడి చచ్చేది... ఇందుకు కాదా అభిమానులు ఆయన మాట కోసం వెర్రెక్కి పోయేది. నిజానికి ఆయన 2 కోట్లు ఇవ్వల్సిన అవసరం లేదు అసలు రూపాయి కూడా ఇవ్వకపోయినా ఆయనకు పోయేదేం లేదు. పోనీ ఇచ్చినా ఓ 10,20 లక్షలు ఇచ్చేసి చేతులు దులుపుకుని ఉండొచ్చు.
నిజానికి చెన్నై లో సగం మందికి పవన్ కల్యాణ్ అనే వ్యక్తి పేరు కూడా తెలిసుండదు. ఆయన సినిమాలు అక్కడ రిలీజ్ కూడా కావు. ఆయన అక్కడ ఉన్న కాలం కూడా తక్కువ. కానీ ఇచ్చాడు.
ఇండస్ట్రీ లో ఇప్పుడు ఎక్కువ సంపాదిస్తున్న స్టార్ ఆయనే అయి ఉండొచ్చు... కానీ మొత్తం ఆస్తి పరంగా మహేష్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇలా ఎవరితో పోల్చుకున్నా పవన్ ఆస్తి చాలా తక్కువ కారణం సూపర్ స్టార్ క్రిష్ణ సంపాదించింది మహేష్ కు వస్తుంది, మెగా స్టార్ సంపాదించింది చెర్రీ కు వస్తుంది. పవన్ కు వచ్చే ఆస్తి వాళ్ళ నాన్న కానిస్టేబుల్ గా పని చేసిన వెంకట్రావు గారిదే మరియు పవర్ స్టార్ తను చేసిన 21 సినిమాలలో డిస్ట్రిబూటర్లకు ఇవ్వగా, దాన ధర్మాలకు పోగా మిగిలినదే ఆయన ఆస్తి.
అందుకే ఆయన జీవ్తిస్తున్న జీవితం చాలా మందికి ఒక కల. ఆయనలా యెవరు బ్రతకలేరు. he is a legend