అటు తమిళంలో పాటు ఇటు తెలుగూ, హిందీలో మంచి క్రేజ్ ఉన్న దర్శకుడు మురుగదాస్. వరుస విజయాలతో దూసుకెళ్తూ అందరి హీరోల దృష్టిని ఆకర్షిస్తునాడు. కాని మురుగదాస్ ఎప్పుడో పవన్ తో సినిమా చేయాల్సింది. అది కూడా తెలుగు, తమిళంలో సూపర్ హిట్ అయిన గజిని సినిమా.
అవును మురుగదాస్ సూర్య తో తమిళంలో గజిని తీసిన తరువాత పవన్ దగ్గరకు వచ్చి గజిని కథని చెప్పాడట. అయితే పవన్ తనకు ఆ సినిమా సరిపోదని, గుండుతో నటిస్తే ఫాన్స్ ఒప్పుకోరేమోనని చెప్పాడట. కాని సినిమా కథ పవన్ కి నచ్చడంతో దానిని తెలుగులో డబ్ చేయమని సూచించి అల్లు అరవింద్ ని రికమెండ్ చేసాడట పవన్.
