ఇటీవల జరిగిన కళ్యాణ్ రామ్ షేర్ సినిమా ఆడియో రిలీజ్ లో తమన్ ను అడ్డంగా బుక్ చేశాడు దిల్ రాజు. తన పాటికి తానేదో ఈ సినిమా గురించి రెండు ముక్కలు మాట్లాడి వెనుతిరుగుతుంటే… ఈ సినిమాలోని ఓ మెలోడి సాంగ్ కు హీరోయిన్ సోనాల్ తో కలసి తమన్ డాన్స్ చేయబోతున్నాడంటూ అనౌన్స్ చేసి అడ్డంగా ఇరికించాడు దిల్ రాజు. తమన్ కాదూ కూడదనడంతో.. అభిమానుల కోసం ఆమాత్రం చేయలేవా అంటూ ఇంకాస్త ఇరుకున పడేశాడు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో తమన్ డాన్స్ చేసేశాడు.
తన భారీ కాయానికి తగ్గట్టు స్టైలిష్ గా ఓ నాలుగు స్టెప్పులు వేసిన తమన్.. వెళ్తూ వెళ్తూ దిల్ రాజుపై ఓ కామెంట్ విసిరాడు. బహుశా.. ఇది దేవిశ్రీప్రసాద్ ఆడియో వేడుక అని దిల్ రాజు అనుకుని ఉంటారని.. అందుకే డాన్స్ చేయమన్నారన్నాడు. మొత్తానికి స్టేజ్ పై డాన్సులు చేయడానికి తానేం దేవిశ్రీని కాదంటూ చెప్పకనే చెప్పాడు తమన్.