కళ్యాణ్ రామ్ నటించిన షేర్ ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాయరయ్యారు. అన్నకోసం విదేశాల్లో షూటింగ్‌ను ఆపుకుని మరీ వచ్చాడు. అయితే అన్న మీద ప్రేమతో వచ్చిన ఎన్టీఆర్‌కి బాలయ్య అభిమానులు కోపం తెప్పించారు. కార్యక్రమంలో అతిధులు మాట్లాడుతుంటే బాలయ్య అభిమానులు రెండు గ్రూపులుగా విడిపోయి ఓ గ్రూపు
మాట్లాడుతున్న సమయంలో నందమూరి అభిమానులు రెండు గ్రూప్ లుగా విడిపోయి కొంతమంది జై బాలయ్య జై జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. దీంతో మరో గ్రూపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటూ కేకలు వేశారు.
దీంతో ఎన్టీఆర్ కాస్త అసహనం వ్యక్తం చేశాడు. స్వయంగా ఎన్టీఆర్ దయచేసి పెద్దలను మాట్లాడనివ్వండి అనిచెప్పినా వారు పట్టించుకోలేదు. చివరికి కళ్యాణ్ కామ్ కూడా కోపం వచ్చింది. వెంటనే మేమంతా ఒక్కటే దయచేసి ఇలా వేరు చేసి మాట్లాడకండి మాదంతా ఒక కుటుంబం ఈరోజు ఇలా మేమంతా ఉన్నామంటే దానికి కారణం మహానటుడు ఎన్టీఆర్ కాబట్టి వేరు చేసి మాట్లాడకండి అని అభిమానులకు సూచించాడు.