Latest News

తమిళనాడులో పవన్ కల్యాణ్ దీక్ష


నిర్బంధ తమిళ భాషా చట్టాన్ని వ్యతిరేకిస్తూ సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తమిళనాడులో దీక్ష చేపట్టనున్నారు. ఈ నెలాఖరున ఆయన చేపట్టే దీక్ష కోసం పవన్ అభిమానులు, తెలుగు భాషాభిమానులు సన్నాహాలు చేస్తున్నారు. నిర్బంధ తమిళభాషా చట్టంతో ఈ రాష్ట్రంలో మైనార్టీ భాషలైన తెలుగు, కన్నడ, ఉర్దూ, మలయాళం విద్యాభ్యాసానికి విద్యార్థులు దూరమైపోతున్నారని తమిళనాడు తెలుగు యువశక్తి, తెలుగు సాహిత్య పరిషత్ సంస్థలు ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ లో ధర్నా నిర్వహించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ స్పందిస్తూ తమిళనాడులో దీక్ష చేపడతానని ప్రకటించారు.


CineSollu Designed by Templateism.com Copyright © 2014

Theme images by gaffera. Powered by Blogger.