రామ్ గోపాల్ వర్మ ఓ మాట అన్నాడు ఈరోజు. అతడు ట్విట్టర్ లో జక్కన్నను ప్రస్థావిస్తూ.. 'ఎస్.ఎస్.రాజమౌళిలో ఎస్.ఎస్ అంటే ఏమిటో తెలుసుకోవాలని ఉంది. ఎస్ ఎస్ అంటే స్టీవెన్ స్పీల్ బర్గ్ అనుకోవాలా?' అని ట్వీటాడు. వర్మ ఇచ్చిన ట్విస్టుకి కంగారు పడిపోయిన రాజమౌళి 'జనాల చేత నన్ను తిట్టించడానికి కాకపోతే .. అవసరమా సార్ ఇప్పుడు ఇది' అంటూ రిప్లయ్ ఇచ్చాడు రాజమౌళి.
దానికి రామ్ గోపాల్ వర్మకు కోపం వచ్చిందేమో మితిమీరిన వినయం అనేది "మితిమీరిన పొగరు అనిపించుకుంటుంది రాజమౌళి" అని డైరెక్ట్ గా అనేశాడు.