మొహానికి మేకప్ వేసుకొని, జుట్టుకు రంగులు వేసుకొనే హీరోలపైన ప్రేమాభిమానాలు చూపించటానికి సిగ్గుండాలని ఆ యువకుడు సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసాడు. దానిలో అభిమానులందరినీ తిడుతూ దేశం కోసం పోరాడమని, హీరోల కోసం కాదని సలహా కూడా ఇచ్చాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో హాల్ చల్ చేస్తుంది. అభిమానులందరినీ ఆడిపోసుకోవటమే కాదు దమ్ముంటే తన దగ్గరికి వచ్చి వాళ్ళ హీరోల గురించి మాట్లాడాలని అడ్రస్ తో సహా ఇచ్చాడు.
ఈ మధ్య జరిగిన హీరోల అభిమానుల మధ్య జరిగిన సంగర్షణ తనను భాదించిందని దేశం కోసం పోరాడాలని, దేశ స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తులను అభిమానించాలని అంతే కాని ఎవడో నాలుగు పిచ్చి గెంతులు వేసే వాడి కోసం మనం ప్రాణాలు ఇవ్వటం ఏంటని ప్రశ్నించాడు. ఏ అభిమాని కైనా దమ్ము ఉంటె తన దగ్గరికి వచ్చి మాట్లాడాలని సవాలు విసిరాడు. అంతటితో ఆగకుండా కొందరు హీరోలను పేర్లు పెట్టి మరీ దుమ్ము దులిపాడు.
See video here: https://www.youtube.com/watch?t=17&v=iatOa0LhAis