శ్రీకాంత్ అడ్డాల తాజా చిత్రం బ్రహ్మోత్సవం. ఈ చిత్రంలో మహేష్ హీరో. కథ విషయానికి వస్తే..శ్రీకాంత్ అడ్డాల సినిమా అంటే బంధాలు..అనుబంధాలు చుట్టూ తిరుగుతుంది కథ.
ఈ సినిమాలో మహేష్ కి ముగ్గురు అత్తలు. ముగ్గురు మరదళ్లు. మహేష్, వారి మేనత్తల కుటుంబాలు చుట్టునే కథ ఉంటుంది. విజయవాడ నేపధ్యంతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవం సినిమా కథ తిరుపతిలో ముగుస్తుందట. మరి..సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో మహేష్ ని సరికొత్తగా చూపించిన శ్రీకాంత్ అడ్డాల..బ్రహ్మోత్సవం లో మహేష్ ని ఎలా చూపించనున్నాడు..? ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేయనున్నాడో తెలుసుకోవాలంటే కొంతకాలం ఆగాల్సిందే.