భీమవరంలో ఇటీవల సెప్టెంబర్ 2న పవన్ పుట్టిన రోజు సందర్భంగా పవన్ కల్యాణ్ అభిమానులు పవన్ ఫ్లెక్సిలు ప్రభాస్ అభిమానులు ధ్వంసం చేసినందుకు గాను ప్రతీకారంగా ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేయగా దానికి ఆయన అభిమానులను జైలులో పెట్టారు, అప్పుడు అధికారులకు పవన్ స్వయంగా ఫోన్ చేసి వారిని విడిపించిన సంగతి మనందరికి తెలిసిందే.
అయితే ఈ రోజు భీమవరం SI చెప్పిన వివరాల ప్రకారం పవన్ కల్యాణ్ గారు భీమవరం టౌన్ కు ఆయన అభిమానులు చేసిన నష్టానికి మరియు ప్రభుత్వ ఆస్తులను బాగు చేయించడానికి 3లక్షలు భీమవరం పంపారు.