గత కొద్ది రోజులుగా నటుడు శివాజీ ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ పోరాటం మధ్యలో ఆయన పవన్ కల్యాణ్ గురించి ప్రస్తావన తెస్తూ ఆయన కూడా ఉద్యమించాలని కోరుతూ ఉన్నాడని కూడా మనకు తెలిసిందే.
అయితే ఇవాళ ఏలూరులో ఆయన మాట్లాడుతూ "ఎందుకు మీరు పవన్ కల్యాణ్ గారి ప్రస్తావన తెస్తున్నారు" అన్న ప్రశ్నకి సమాధానంగా "ఒకప్పుడు రాష్ట్రంలో కులాలు మతాలకి అతీతంగా NTR గారిని అభిమానించారు ఇప్పుడు పవన్ కల్యాణ్ గారిని అదేలా అభిమానిస్తున్నారు, ఆ విషయం బహుశా ఆయనకు కూడా తెలిసుండదు. ఆయన ఆ విషయాన్ని తెలుసుకుని పోరాడితే ప్రత్యేక హోదా తప్పకుండా వస్తుంది" అన్నారు.
