Latest News

Hospital where first 'Chloroform' was made, is going to be demolished... !!!

తెలుగు రాష్ట్రాల నలుమూలలకు ప్రధాన రిఫరల్‌ ఆస్పత్రి ఉస్మానియా. పేదలకు పెన్నిధి ఈ సర్కార్‌ దవాఖానా. ఏ చిన్న జబ్బొచ్చినా ఉస్మానియాకు రావాల్సిందే. ఇ క్కడ వైద్య సేవలే కాదు... నిష్ణాతులైన వైద్యులున్నారు. అప్పట్లో క్లోరోఫామ్‌ మత్తు మందును ఇక్కడే కనుగొన్నా రు. ఇక్కడి నుంచే ఎందరో వైద్యులు తమ వైద్య పరి జ్ఞానికి పదును పెట్టుకున్న వారు ఉన్నారు. ఇక్కడ ఎన్నో క్లిష్టతరమైన శస్త్ర చికిత్సలు జరిగాయి. ఎందరికో ప్రాణం పోశారు. కేవలం ఆస్పత్రిగానే కాక వైద్య నిపుణులకు పుట్టినిల్లుగా సంస్థ తన ఘనతను చాటుకుంటోంది. ఇప్పు డు పెద్ద పెద్ద కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో సేవలు అందిస్తున్న వందలాది మంది వైద్య నిపుణులు ఈ ఆస్పత్రిలో శిక్షణ పొందిన వారే. కేవలం రాష్ట్రంలోనే కాకుండా దేశవిదేశాల్లో ఈ ఆస్పత్రి నుంచి వచ్చిన వైద్యులే సేవలందిస్తున్నారు. పాత భవనాన్ని కూల్చి ట్విన్‌ టవర్స్‌ నిర్మించాలని తెలం గాణ ప్రభుత్వం నిర్ణయించింది. చారిత్రాత్మక కట్టడాలను కూల్చి కొత్త భవనాలు నిర్మించడం సరైంది కాదనే అభి ప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అనేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాల్లో ఈ ట్విన్‌ టవర్స్‌ నిర్మించవచ్చునని సీనియర్‌ వైద్యులు, నగర ప్రేమికులు, ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. 153 ఏళ్ల చరిత్ర గల పాత భవనాన్ని కాలగర్బంలో కలిపేస్తే ఎలా అని మండిపడుతున్నారు. మొన్న చెస్ట్‌ ఆసుపత్రిపై కన్ను వేసిన ప్రభుత్వం ఇప్పుడు ఉస్మానియా ఆసుపత్రి పాత భవనాన్ని కూల్చాలని చూస్తుందని విమర్శిస్తున్నారు. ఈ మేరకు ఫోరం ఫర్‌ బెటర్‌ హైదరాబాద్‌ బృందం ఉస్మానియా ఆసుపత్రి పాతభవనాన్ని కూల్చవద్దని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపాల్‌ సెక్రటరీ, తెలంగాణ ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ, హెచ్‌ఎండీఏ కమిషనర్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్లకు లేఖ రాసింది. జేఎన్టీయూ రిపోర్టును ఆధారంగా చేసుకొని తీసుకున్న నిర్ణయాన్ని ఆ బృందం ఖండించింది.

CineSollu Designed by Templateism.com Copyright © 2014

Theme images by gaffera. Powered by Blogger.