క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య ట్విట్టర్ వేదికగా సరదా వార్ జరిగింది. ‘నేను ఆడాలనుకుంటున్నాన’ని సచిన్ కోహ్లికి… ట్వీట్ చెయ్యగా… దానికి విరాట్ వేగంగా స్పందించాడు. ‘కచ్చితంగా చెప్పలేను కానీ మీకు కావాల్సిన అర్హతలు లేవ’ని రిప్లై ఇచ్చాడు. అయితే ఇదంతా పరిహాసంలెండి. ఇంతకు విషయం ఏంటంటే…
ఐపీటీఎల్‌లో యూఏఈ రాయల్స్‌లో కోహ్లీ వాటా దక్కించుకున్నాడు. ఈ టీమ్‌కు స్వి స్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెడరర్ నేతృత్వం వహించనున్నాడు. ఫెడెక్స్‌కు సచిన్ పెద్ద అభిమాని. ఈ నేపథ్యంలో రోజర్‌తో ఆడాలనే తన కోరికను సచిన్ కోహ్లి ముందు ఉంచాడు.
